నార్నూర్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ( Village Issues ) పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ (Narnoor Mandal ) మండలం సుంగపూర్, నార్నూర్ మండల కేంద్రాన్ని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి పర్యటించారు.
సుంగపూర్లో కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంక్, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాలలో ల్యాబ్ ప్రారంభించి, పలు వివరాలు ఉపాధ్యాయుని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల సామర్థ్యం అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట తహసీల్దార్ జాడి రాజలింగం, డీఎల్పీవో ప్రభాకర్, ఎంపీడీవో రాథోడ్ గంగా సింగ్, ఎంఈవో పవర్ అనిత, డీఈలు శివప్రసాద్, శ్రీనివాస్, ఎంపీవో సాయి ప్రసాద్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.