నిర్మల్ చైన్‌గేట్/ఎదులాపురం మే, 16: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలు సేకరించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్లు వేర్వేరు సమావేశాల్లో జిల్లా అధికారులతో మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ట్యాబ్‌ల ద్వారా రోజువారీగా కొనుగోలు వివరాలు నమోదు చేయాలని సూచించారు. రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో, ఇన్చార్జి డీఎస్వో కోమల్‌రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజిద్ అలీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.