దస్తురాబాద్ : వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ (DPO Srinivas) ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ( LRS Applications ) తక్షణమే పరిష్కరించాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు 25 శాతం సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు.
నర్సరీల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను పెంచి రక్షించాలని సూచించారు. నర్సరీల నిర్వాహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. అంతకుముందు మండలంలోని రేవోజిపేట, బుట్టాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఆయన గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించారు.
రికార్డుల పరిశీలన అనంతరం గ్రామాల్లో నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామం, సెగ్రిగేషన్‌షెడ్లు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ సర్పరాజ్ నవాజ్, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో రమేశ్‌రెడ్డి, సూపరింటెండెంట్ గోపాల్‌కిషన్, మిషన్ భగీరథ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులున్నారు.