కుభీర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ యోజన( PM Kisan Yojana ) , రైతు భరోసా పథకాలు మండలంలోని రైతులందరికీ వర్తించేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏవో సారిక రావు ( AO Sarika rao ) కు రైతులు బుధవారం వినతి పత్రం అందజేశారు.
గిరిజన రైతు నాయకులు పండిట్ జాదవ్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని వందలాది మందికి పీఎం కిసాన్ తోపాటు రైతు భరోసా పథకాలు వర్తించకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో ఈ పథకాలు వర్తించని రైతుల జాబితాను గ్రామాల వారీగా తయారుచేసి రైతులను చేర్చాలని డిమాండ్ చేశారు.
కేవైసీ అవసరమున్న రైతుల దగ్గర ఆధార్ పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని ఏఈవోలు పూర్తి చేయించి తద్వారా పథకాలు వర్తించేలా చూడాలని కోరారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి రైతులందరికీ పీఎం కిసాన్, రైతు భరోసా పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.