బెల్లంపల్లి, నవంబర్ 9 : పట్టణంలోని బాలగంగాధర్ తిలక్‌స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 రాష్ట్ర స్ధాయి సాఫ్ట్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా, బాలికల విభాగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. ఉమ్మడి ఆదిలాబాద్ బాలుర జట్టు ద్వితీయ స్ధానం సాధించింది. బాలికలలో ఉమ్మడి మెదక్ జిల్లా ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. తృతీయ స్థానాల్లో బాలురలో ఉమ్మడి నిజామాబాద్, బాలికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జట్లు గెలుపొందాయి. విజేతలకు ఏసీపీ రవికుమార్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో దేవ య్య, తాండూర్ సీఐ కుమారస్వామి, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి అంజయ్య బహుమతులు అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటము లు సహజమని, క్రీడాస్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. చదువుతో పాటు క్రీడ ల్లో రాణించి పాఠశాలలు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్ర తి రోజూ సాధన చేస్తే సునాయసంగా గెలు పు సొంతమవుతుందన్నారు. క్రీడాల్లో రా ణించి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉం డాలని ఆకాంక్షించారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి తొమ్మిది బాలికలు, ఎనిమిది బాలు ర జట్లు పాల్గొనగా, దాదాపు 360 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎస్జీఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాలేజ్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి, టోర్నమెట్ ఆర్గనైజర్ బీ.బాబురావు, అబ్జర్వర్‌గా నిజామాబాద్ జిల్లా నుంచి పీడీ గంగమోహన్, శంకర్, కో ఆర్డినేటర్‌గా ఆదిలాబాద్ జిల్లా నుంచి పీడీ స్వామి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు రామ్మెహన్‌రావు, యాకూబ్, బండి రవి, చాంద్‌పాషా, రాజ్‌మహ్మద్, శ్రీనివాస్,శ్రీనివాసరెడ్డి, సంతోష్, చిన్నక్క, యాదగిరి పాల్గొన్నారు.