నస్పూర్/ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 20 : స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వా రా కలెక్టర్లు, పోలీసులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమ లు చేయాలన్నారు.
మంచిర్యాల కలెక్టర్ కు మార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో 306 గ్రా మపంచాయతీలు, 2,680 వార్డులకు ఎన్నిక లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే మాట్లాడుతూ జిల్లాలోని 335 గ్రామపంచాయతీలు, 2,874 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఆయాచోట్ల డీసీపీ భాస్క ర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రా వు, జడ్పీసీఈవో గణపతి, ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం. డేవిడ్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా, అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, పాల్గొన్నారు.

పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలి
మంచిర్యాల జిల్లాలో పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. పామాయిల్ సాగుతో కలిగే లబ్ధిని రైతులకు వివరించాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 438 ఎకరాల్లో పంట వేశారన్నారు. మిగితా లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందిస్తామన్నారు. అనంతరం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి 6వ జల పురస్కారాల్లో భాగంగా మంచిర్యాల జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చినందుకు కలెక్టర్‌ను అధికారులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, ఉద్యానవన శాఖ అధికారి అనిత, పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, తదితరులు పాల్గొన్నారు.