నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 2 : పదో తరగతి మూల్యాంకనాన్ని బుధవారం నుంచి విద్యాశాఖ ప్రారంభించనుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజులపాటు మూల్యాంకనం చేసి 12వ తేదీన క్యాంపును ముగించనున్నారు. నిర్మల్ జిల్లాకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం సబ్జెక్టులకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి 1.40 లక్షల పేపర్లు వచ్చాయి. వీటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి, బందోబస్తు ఏర్పాటు చేశారు.
పటిష్టంగా మూల్యాంకనం..
లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా మూల్యాంకనం చే సేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎగ్జామినర్లు(ఏఈ) సెల్ఫోన్ వాడకుండా చర్యలు తీసు కుంటున్నారు. ఉపాధ్యాయులు దిద్దిన పేపర్లను ఆయా సబ్జెక్టుకు సంబంధించిన ఎక్స్పర్ట్లు తనిఖీ చేస్తారు. స్క్రూటినైజింగ్ చేసిన అనంతరం కోడింగ్, డీకోడింగ్ ఆధారంగా మార్కులు వేస్తారు.
అధికారులు వీరే..
మూల్యాంకనానికి విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులు విధుల్లో పాల్గొననున్నారు. జిల్లా క్యాంపు ఆఫీసర్గా డీఈవో రవీందర్రెడ్డి, అసిస్టెంట్ క్యాంపు అధి కారులు ఇద్దరు, స్ట్రాంగ్ రూం ఇన్చార్జి ఒకరు, పర్యవేక్ష కుడు ఒకరు, అసిస్టెంట్ కోడింగ్ అధికారులు ఏడుగురు, కోడింగ్ సహాయకులు 30, ఏఈలు 394, సీఈలు 65, స్పెషల్ అసిస్టెంట్లు 67, మూల్యాంకన పర్యవేక్షకులు ఏడుగురి ఆధ్వర్యంలో మూల్యాంకనం పూర్తవుతుంది.
సకాలంలో పూర్తి చేస్తాం..
నిర్మల్ జిల్లాకు విద్యాశాఖ నిర్ధేశించిన గడువులోగా మూల్యాంకనాన్ని పూర్తి చేస్తామని క్యాంపు అధికారి, డీఈవో రవీందర్రెడ్డి తెలిపారు. ఇప్పటికే జిల్లాకు 1.40 లక్షల జవాబు పత్రాలు జిల్లాకు చేరాయి. వీటిని పోలీసు పహారాలో స్ట్రాంగ్ రూంలో భద్రపర్చాం. మూల్యాంకన కేంద్రంలో ఏఈ, సీఈ మిగతా అధికారులందరూ క్యాంపు మార్గదర్శకాలను పాటించి మూల్యాంకనం చేయాలని సూచించాం. అందరి సహకారంతో పొరపాట్లు జరుగకుండా పూర్తి చేస్తాం.
– రవీందర్రెడ్డి, క్యాంపు అధికారి.