నార్నూర్, అక్టోబర్ 29 : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని స్టాఫ్ నర్స్ మడవి జంగుబాయి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా సుంగాపూర్ గ్రామంలో పీఎం జన్ మాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధుల భారిన పడే అవకాశాలు ఉంటాయన్నారు.
వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత కూడా పాటించాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధుల బారిన పడితే తక్షణమే వైద్య చికిత్సలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ గంగాదేవి, సావిత్రి, జై భారత్ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దీపక్, గ్రామ పెద్దలు ఉన్నారు.