ఆసిఫాబాద్ టౌన్, మార్చి 28 : ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, కుసం నీలాదేవి, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం డేవిడ్, జిల్లా అటవీ అధికారి నీర జ్ కుమార్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శు క్లా, ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ బోగాడెతో కలిసి ఆర్వోఆర్, అట్రాసిటీ, భూ సమస్యలు, ఎస్సీ, ఎస్టీలకు కల్పించే ప్రయోజనాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలో పోలీసు శాఖ తరఫు న ఎస్సీ, ఎస్టీలు నమోదు చేసిన అట్రాసిటీ కేసుల వివరాలు, బాధితులకు జరిగిన న్యాయం, అందిన పరిహారం గురించి అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, పోడు భూముల పరిషారం, గురుకులాలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, అన్ని శాఖల్లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఉద్యోగోన్నతులు-రోస్టర్ విధానంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరగా పరిషరించేలా అధికారుల సమన్వయంతో చర్య లు తీసుకుంటామన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌కు చేరుకున్న కమిషన్ చైర్మ న్, సభ్యులకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ర మాదేవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శా ఖ అధికారి సజీవన్, జిల్లా అధికారులు, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యు లు కేశవరావు, గోపాల్, గణేశ్, అశోక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, మార్చి 28 : మంచిర్యాల కలెక్టరేట్లో అధికారులతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం చర్య లు చేపట్టాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని పేర్కొన్నారు. పోలీస్ శాఖ పరిధిలోని కేసులను క్రమబద్ధం గా పరిష్కరించాలని, మే 31లోగా మొత్తం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు తహసీల్దార్లు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, మార్చి 28 : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను సీసీసీలోని సింగరేణి అతిథి గృహంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ మర్వాదపూర్వకంగా కలిశారు. వెంకటయ్యను శాలువాతో సత్కరించి, పూల మొక్క అందజేశారు. ఈ ప్రాంత సింగరేణి అంశాలపై వారు చర్చించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, శ్రీరాంపూర్ ఎస్వోటూ జీఎం సత్యనారాయణ, ఏజీఎం రాజేందర్, డీజీఎం పర్సనల్ అరవిందరావు, ఐఈడీ ఎస్ఈ, ఎస్సీ లైజన్ అఫీసర్ కిరణ్‌కుమార్, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి తదితరులు ఉన్నారు.