జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్, రామాలయాల్లో వేదపండితులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను హనుమాన్ దీక్షాపరులు, భక్తులు శోభాయాత్రగా ఆలయాలకు తీసుకువచ్చారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వామివార్లకు పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
– నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 6
పాత మంచిర్యాలలోని శ్రీ రామాలయ దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాజకుమారి దంపతులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపిల్లి విజిత్ రావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వనాథ ఆలయంలో నిర్వహించిన కల్యాణంలో పాల్గొన్నారు. సాయికుంట వేంకటేశ్వర స్వామి ఆలయంలో కమిటీ అధ్యక్షుడు తాటిపల్లి అశోక్ దంపతులు, మున్సిపల్ మా జీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ గాయత్రి దంపతులు, అలాగే హమాలీవాడ హనుమాన్ ఆలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్ పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ కాలనీ భక్తాంజనేయాలయంలో జరిగిన వేడుకల్లో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, ఆలయ కమిటీ అధ్యక్షుడు తోట సురేశ్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి, ఆర్కే 6 గుడిసెలు కొత్తరోడ్ ఆంజనేయాలయంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పూజలు చేశారు. ఆయా చోట్ల కమిటీ అధ్యక్షుడు మారుతి, మాజీ కౌన్సిలర్లు పం బాల గంగాఎర్రయ్య, బెడిక లక్షి పాల్గొన్నా రు.
నస్పూర్ కాలనీ షిర్కే వెంకటేశ్వరాలయంలో సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ-మాలతి, జీఎం ఎం శ్రీనివాస్-ఉమారాణి, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రా వు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు పాలొన్నారు. అలాగే నస్పూర్ కాలనీ ఆంజనేయాలయంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాక్, టీబీజీకేఎస్ ప్రధాన క్యాదర్శి సురేందర్‌రెడ్డి, నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్మిల్ల వేణు పూజలు చేశారు.
హాజీపూర్ మండలం ములల్ల, వేంపల్లిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ పూజలు చేశారు. దండేపల్లి మండలం వెల్గనూర్ రామాలయ దేవస్థానం ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ రావు పాల్గొన్నారు. ఆయనను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ఆలయానికి రూ.25వేలు విరాళంగా అందచేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ కోదండ రామాలయం ఆవరణలో సీతారాములకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.
సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, సినీ దర్శక నిర్మాత దండ నాయకుల సురేశ్ కుమార్, మాజీ ఎంపీపీలు మల్లికార్జున యాదవ్, బాలే ష్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. కాసిపేట మండలం దేవాపూర్ హనుమాన్, అయ్యప్ప, సల్పాలవాగులోని రామాలయంలో బెల్లంపల్లి మాజీ ఎ మ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. స్వ యంగా భక్తులకు మంచినీరు పోసి, భోజనం వడ్డించారు.
బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొ ల్లు రమణారెడ్డి, గొంది వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, సీనియర్ నాయకులు వాసుదేవ్, మచ్చ అశోక్, గోనె రవీందర్, సంజీవ్ యాదవ్, సుధాకర్ రెడ్డి, సుధాకర్, శేఖర్, అనీల్, నరేశ్, అఫ్జల్, రాజేశ్, జాడి వేణు, కొండ విజయ్, కమలాకర్, నారాయణ తదతరులు పాల్గొన్నారు. మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియాలో గల పంఛముఖి ఆలయం ఆధ్వర్యంలో మిథిల మైదానంలో నిర్వహించిన వేడుకలకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పట్టు వస్ర్తాలు, తలంబ్రాలతో హాజరయ్యారు.
వేద పండితులు ఆయనకు శేష వస్ర్తాన్ని సమర్పిం చి, పూర్ణకుంభ స్వాగతం పలికారు. రామన్ కాలనీలోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్దన్ పూజలు చేశారు. మూడో జోన్ కాశీవిశ్వేశ్వర ఆలయంలో సింగరేణి అధికారులతో పాటు, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే వివేక్ కళశంతో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు జే రవీందర్, కొంగల తిరుపతి రెడ్డి, బండారు సూరిబాబు, ఎండీ అబ్బాస్, సీపెల్లి రాజలింగు, భూపెల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే చెన్నూర్ మండలం సుద్దాలలో ఎమ్మెల్యే వివే క్ పాల్గొన్నారు. సీఐ దేవేందర్ రావు, ఎస్ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే భీమారం శ్రీ కోదండ రామాలయాలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, భీమారం ఎస్ఐ శ్వేత బందోబస్తు నిర్వహించారు. ఎస్టీపీపీ కోదండ రామాలయంలో ఎమ్మెల్యే, ఈడీ చెన్నకేశవుల చిరంజీవి, జీఎం శ్రీనివాసులుతో పాటు, పలువు రు అధికారులు పాల్గొన్నారు.
దహెగాంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని కో దండ రామాలయంలో అన్నదాన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముస్లిం మైనా ర్టీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ముస్లింలు అన్నం వడ్డించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు, సింగరేణి అధికారులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ బీ అశోక్, భక్తులు దర్శించుకున్నారు.
కౌటాల బస్టాండ్ నుంచి చింతలమానేపల్లి మండలం కర్జెల్లిలోని ఓంకార ఆశ్రమం వరకు సీతారాముల పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావనం శ్రీ రాధా కృష్ణా తపోవన ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శివరా కృష్ణ, మందమర్రికి చెందిన శ్రీ రామ చంద్ర అవధాని, వరంగల్ తొర్రూర్ ఆశ్రమ పీఠాదిపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థా నం, భద్రాచలం నుంచి పట్టువస్ర్తాలు, ము త్యాల తలంబ్రాలు రాగా, తాళ్లపల్లి సత్యనారాయణ గౌడ్, దూస మహేశ్వర్ ప్రసాద్ ఆలయానికి సమర్పించారు.
సీఐ ముత్తే రమేశ్ ఆధ్వర్యంలో ఎస్ఐ మధూకర్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జన్నారం మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎం రాజశేఖర్, గుండ సుధాకర్, ఎంఅర్ న ర్సింగరావు, గోలి రాంచందర్‌రెడ్డి, కమలాకర్‌రావు, తనుగుల భూమాగౌడ్, స్వదేశీరావు, జాడి గంగాధర్, కమ్మల విజయధర్మ తదితరులు పాల్గొన్నారు. తాండూర్‌లో సీఐ కుమారస్వామి, తాండూర్, మాదారం ఎస్ఐలు కిరణ్‌కుమార్, సౌజన్య, ప్రజాప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
కోటపల్లి మండలం కొండంపేటలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ హాజరయ్యారు. ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే కన్నెపల్లి, భీమిని, కెరమెరి, రెబ్బెన, బెజ్జూర్, పెంచికల్పేట్, వేమనపల్లి, కాసిపేట, మందమర్రి, చెన్నూర్ మండలాల్లో వేడుకలు నిర్వహించారు.