ఎదులాపురం, జూన్ 1 : ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలను పూర్తిగా అరికడుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఎస్ బృందం ఆధ్వర్యంలో పోలీసు టాస్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
గతం వారం రోజుల వ్యవధిలో మూడు కేసులను నమోదు చేశామన్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి, ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. అలాంటి వారి సమాచారాన్ని డయల్ 100 లేదా 8712659965 నంబర్‌కి అందజేయాలని పేర్కొన్నారు. గతంలో కేసులు నమోదైన వారిపై ప్రత్యేక దృష్టి సారించి, వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు.