ఇంద్రవెల్లి : అమర వీరుల స్తూపాన్ని ( Martyrs Statue) పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసిందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ( MLA Vedma Bojju Patel ) అన్నారు. శనివారం ఇంద్రవెల్లి ( Indravelli ) మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు.
అనంతరం హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొక్కలు నాటారు. స్తూపం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాపు పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో స్మృతి వనాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. అమర వీరుల స్తూపాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు సీఎంతో మాట్లాడతానన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు, రగల్ జెండా కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట ..
మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని పిప్రి గ్రామంలో నిర్వహించిన పీఎం జన్మన్ సదస్సులో పాల్గొన్నారు.