ఇచ్చోడ(సిరికొండ), జూన్ 27 ః విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రత్యేకాధికారి, డీఎల్పీవో ఫణిందర్ అన్నారు. శనివారం సిరికొండ మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా పరిసరాలతోపాటు కూరగాయలు, వంట సామాగ్రిని పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో నీరు నిల్వకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులతో వంద శాతం హాజరయ్యేటట్లు చూడాలన్నారు. వెంట ఎస్వో సంధ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.