నస్పూర్, ఆగస్టు 6 : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో జాతీయ కమిషన్ సంచాలకుడు సునీల్‌కుమార్ బాబు, రీసెర్చ్ అధికారి వర ప్రసాద్, కలెక్టర్ కుమార్ దీపక్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీ ణ్, అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి వివి ధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో షెడ్యూల్డ్ కులాల జనా భా 25 శాతం ఉన్నారని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ 23 వసతి గృహాల్లో 2078 మందికి వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో 648 మం ది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. షెడ్యూల్డ్ కులాల ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రభు త్వం బ్యాంకు లింకేజీ ద్వారా రుణా లు అందిస్తున్నదని తెలిపారు. అట్రాసిటీ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యా యం చేయాలన్నారు. ఎస్సీలకు అందించే సం క్షేమ పథకాలపై అధికారులు గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో పోలీసులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వినతుల వెల్లువ..
సీసీసీ నస్పూర్, ఆగస్టు 6 : జిల్లా పర్యటనలో భాగంగా సీసీసీ సింగరేణి అతిథి గృహానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్‌కు పలువురు వినతిపత్రా లు అందజేశారు. పాత మంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులకు న్యాయం చేయాలని, యజమానికి మల్కా కొమురయ్య పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. భారతీయ మజ్దూర్ సంఘం జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్, కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్, కార్యదర్శి నిమ్మరాజుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సగ్గుర్తి ఆనందరావు కమిషన్ సభ్యుడి సత్కరించారు.