నస్పూర్, అక్టోబర్ 7 : షెడ్యూల్డు తెగల ప్రాంతాల అభివృద్ధిపై ప్ర త్యేక దృష్టి పెడుతామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవా రం కలెక్టరేట్లో జడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారంతో కలిసి ఎంపీడీవో, పంచాయతీ అధికారులు, జిల్లా సంక్షేమశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని షెడ్యూల్డు తెగల ప్రాంతాల్లో నిర్వహించే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రతిపాదనలు రూపొందించి నివేదికలందించాలని ఆదేశించారు.
పల్లెల్లోని విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నా. దెబ్బతిన్న అంతర్గత రహదారులు, వంతెనల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. షెడ్యూల్డు తెగల ప్రాంతాల్లో పాడైపోయిన ఇండ్లను గుర్తించాలన్నారు. ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్యపై నివేదికలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ బాలకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.