నార్నూర్ : వార్షిక పరీక్షలకు ( Annual exams ) విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఇంటర్మీడియట్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి గణేష్ కుమార్ జాదవ్ ( Ganesh Kumar Jadhav ) అధ్యాపకులకు సూచించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలన్నారు. అనంతరం కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.
భారత రాజ్యాంగ అవశ్యకతపై విద్యార్థులకు జిల్లా అధికారి వివరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ షేక్ మోసిన్, ప్రిన్సిపాల్ కేశవులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీ కాంబ్లే, అధ్యాపకులు ఉన్నారు.