ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 20 : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ సురేశ్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్యకంగా ఉండాలని, సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఆసిఫాబాద్ పట్తణ సీఐ సతీష్, ఎస్ఐ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.