నిర్మల్ అర్బన్, మార్చి 31 : పోలీసులందరి సమష్టి కృషి ఫలితంగానే ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపుగా స్కోచ్ అవార్డు రావడం సంతోషకరమని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ అవార్డు గౌరవంతోపాటు బాధ్యతను పెంచిందని, ఇకపై మెరుగైన సేవలను అందిస్తూ ప్రతి బాలికలకు భద్రత, నమ్మకం కల్పించడమే లక్ష్యమని అన్నారు.
ఈ సందర్భంగా నారీ శక్తిలో భాగస్వాములైన మహిళా కానిస్టేబుళ్లను శాలువాతో సన్మానించారు. కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేందర్‌రెడ్డి, సాయికిరణ్ ఉన్నారు.