నిర్మల్ అర్బన్, ఆగస్టు 25 : వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో హిందూ ఉత్సవ సమితి శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఉత్సవ సమితి సభ్యులు వారి సమస్యలను అభ్యర్థనలను శోభాయాత్ర రోజున తీసుకోవాల్సిన ఏర్పాట్లను ఎస్పీకి వినరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు పోలీసుల సూచనలు పాటించాలని పేర్కొన్నారు. ఏఎస్పీ రాజేశ్ మీన, సీఐ ప్రవీణ్ పాల్గొన్నారు.