నార్నూర్, డిసెంబర్ 12 : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. గాదిగూడ, నార్నూర్ మండలంలోని నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వెయ్యి మందికి దుప్పట్లను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. చలి తీవ్ర నుంచి రక్షించేందుకునేందుకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపా రు. అలాగే యువత మత్తు పదార్థాలకు దూ రంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి మం డలంలో నెలకున్న సమస్యలను పోలీసుల దృ ష్టికి తీసుకొస్తే అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కా ర్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ మార్మా ట్, ట్రెయినీ కలెక్టర్ అభినవ్, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, నార్నూర్ సీఐ రహీంపా షా, ఉ ట్నూర్ సీఐ మొగలి, సైబర్ డీఎస్పీ అషీబుల్లా, ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్, నరింజిపటేల్, రా యి సెంటర్ జిల్లా సార్మెడి మెస్రం దుర్గు ప టేల్, జేఏసీ చైర్మన్ మెస్రం రూప్‌దేవ్, తుడుం దెబ్బ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెం దోర్ దాదిరావ్, డివిజన్ అధ్యక్షుడు కనక ప్ర భాకర్, మండలాధ్యక్షుడు శ్రీరామ్, జిల్లా ఉ పాధ్యక్షుడు మెస్రం మానిక్‌రావు, సర్పంచ్ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు ఉర్వేత రూ ప్దేవ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్ పాల్గొన్నారు.
ఎదులాపురం, డిసెంబర్ 12 : జిల్లావ్యాప్తంగా 15,16 తేదీల్లో జరిగే టీజీపీఎస్సీ గ్రూ ప్-2 పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ గౌష్ ఆ లం ఒక ప్రకటనలో తెలిపారు. 15వ తేదీ ఉద యం 6 గంటల నుంచి 16వ తేదీ సాయం త్రం 6 గంటల వరకు అంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. కేంద్రాలకు 200 మీ టర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేరొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.