ఎదులాపురం, జూలై 17 : ఆపతాలంలో ఉన్న అతివలకు అం డగా ఉండాలని సఖీ కేంద్రం సిబ్బందికి ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టర్ చౌరస్తాలోని స ఖి కేంద్రాన్ని ఎస్పీ, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌తో కలిసి సందర్శించారు. సఖీ కేంద్రం ద్వారా మహిళలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ సఖీ కేంద్రం ద్వారా కుటుంబ కలహాలతో ఉన్న మహిళలు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ సేవలు అందుతాయని, కౌన్సెలింగ్ ద్వారా పరిషారం కానీ సందర్భాలలో పోలీసుల సహాయం, న్యాయ సహాయంతో న్యాయం చేకూర్చే సేవలు లభిస్తాయని తెలిపారు.
ప్రజలు అత్యవసర సమయాల్లో డయల్ 100 సేవలు లేదా సఖీ కేంద్రాన్ని 181 నంబర్‌పై సంప్రదించాలని సూచించారు. సఖీ కేంద్ర ఇన్చార్జి నిర్వాహకులు లావణ్య, లీగల్ కౌన్సెలర్ సంఘమిత్ర, వన్ టౌన్ సీఐ సునీల్‌కుమార్, సఖీ సెంటర్ సి బ్బంది అక్షయ్, కేస్‌వర్కర్ నాగమణి ఉన్నారు.