ఆదిలాబాద్ : చిన్ననాటి నుండి వ్యాయామ లక్షణం అలవర్చుకోవడం ఉత్తమ లక్షణమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం నేరేడిగొండ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా చిన్నపిల్లల పార్కును అఖిల్ మహాజన్ ఐపీఎస్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ లో నివసించే పిల్లలు, బయటి విద్యార్థులు ఈ చిల్డ్రన్ పార్కులో ప్రతిరోజు ఆటలు ఆడుతూ, వ్యాయామం చేస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలన్నారు.
అనంతరం ఎస్పీ పిల్లలతో సంభాషిస్తూ విద్యపై ఆసక్తిని పెంపొందించుకుంటూ ఆటలను సైతం ఆడుతూ జీవితాన్ని సంతోషంగా గుడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడా సీఐ భీమేష్, ఎస్ఐ ఎల్ శ్రీకాంత్, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.