ఆదిలాబాద్, మే 30(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో జొన్న కొ నుగోళ్లు నేటి(శనివారం)తో ముగియనున్నాయి. మార్కెట్లో కొనుగోలు చేసిన సంచుల రవాణాలో జాప్యం, గన్నీ బ్యా గుల కొరత, వర్షాల కారణంగా పలుమా ర్లు కొనుగోళ్లలో అంతరాయం కలిగింది. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా రైతులు 1.10 లక్షల ఎకరాల్లో జొన్నలను సాగు చేశారు. ఎకరాకు 12 నుంచి 15 క్విం టాళ్ల దిగుబడి వచ్చింది. 12 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రాథమిక సహకార సం ఘాల ద్వారా పంటను సేకరించారు. ప్రై వేటు వ్యాపారులు క్వింటాలుకు రూ. 2,600తో కొనుగోలు చేస్తుండడంతో రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాలుకు రూ.3371తో విక్రయించారు. జిల్లా వ్యాప్తంగా 5.20 లక్షల క్వింటాళ్ల పంటను కొనుగోలు చేశారు.
యాసంగిలో సాగు చేసిన జొన్న కోతలు పలు గ్రామాల్లో పూర్తి కాలేదు. వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో పొలాల్లో తడసిపోతున్నది. పలు కారణాలతో కొనుగోలు కేంద్రాలకు సెలవులు ప్రకటించడంతో రైతులు పంటను విక్రయించ లేదు. వర్షాలతో తేమ శాతం పెరగడంతో కేంద్రాల నిర్వాహకులు పంటను తీసుకోవడం లేదు. దీంతో రైతులు పంటను విక్రయించడంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రైతుల వద్ద ఇంకా పంట నిల్వలు ఉండగా.. నేటితో కొనుగోళ్లు ముగియనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.800 తక్కువకు పంటను కొనుగోలు చేస్తుండడంతో వారికి అమ్మితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. అధికారులు స్పందించి కొనుగోళ్ల గడువును పెంచాలని కోరుతున్నారు.
నేను ఏడెకరాల్లో జొన్న సాగు చేశా. వాతావరణ పరిస్థితుల కారణంగా పం టను తీయడంలో ఆలస్యం అయింది. ఎకరాకు 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు పంట తీస్తే తేమ ఎక్కువగా ఉంటుంది. వర్షాల కారణంగా హర్వేస్టర్ల ద్వారా పంటను తీసే అవకాశం లేకుండా పోతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో తీసినా కొనుగోలు కేంద్రాల సిబ్బంది జొన్నలను కొనుగోలు చేయడానికి నిరాకరిస్తారు. రోజు వర్షం పడుతుండడంతో ఎండబెట్టే అవకాశం లేదు. అధికారులు స్పందించి జొన్నల కొనుగోళ్ల గడువును మరో పది రోజుల వరకు పెంచాలి.
– సుభాష్, రైతు, మావల
నేను 40 క్వింటాళ్ల జొన్నలను ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు అమ్మడానికి తీసుకొచ్చి నాలుగు రోజులు అవుతుంది. తేమ ఎక్కువ ఉందని కొనుగోలు కేంద్రాల సిబ్బంది తీసుకోలేదు. ఎండబెట్టాలని సూచించారు. దీంతో షెడ్డులో ఉన్న జొన్నలను కిందికి దించి ఎండపెడుతున్నా. నిన్న పడిన వర్షానికి పంట తడిసింది. ఎండలు లేకపోవడం తో తేమ శాతం తగ్గడం లేదు. నాలుగు రోజుల నుంచి ఎండపెడుతున్నా కొనుగోలు చేయడం లేదు. రైతులు ఇబ్బందులు పడకుండాఅధికారులు జొన్నలు కొనుగోలు చేయాలి.
– సునీల్, రైతు, తర్నం, భోరజ్