బోథ్, మే 29 : జొన్నలు కొనడంలో అధికారుల జాప్యం, నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొనాలలోని కొనుగోలు కేంద్రంలో శుక్రవారం బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తుల శ్రీనివాస్ మాట్లాడుతూ..జొన్నలు తెచ్చి నెలరోజులైనా తరలించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. గన్నీ సంచులు, లారీల కొరతతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
కాంగ్రెస్ నాయకులు మాత్రం ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్పా చేసిందేమీ లేదన్నారు. పంటల కొనుగోళ్లలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎకరాకు కేవలం 10 క్వింటాళ్లు కొంటున్నారని, మిగతా పంటను ఎకడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా కొనుగోళ్లలో ఇబ్బందులు తొలగించపోతే రైతులతో కలిసి కాం గ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
తలమడుగు, మే 29 : తలమడుగు మండలంలోని సుంకి డి అంతర్రాష్ట్ర రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాంసి, తలమడుగు మండలాల రైతులు రహదారిపై రా స్తారోకో చేపట్టారు. నెలల తరబడి రోడ్డుపై జొన్నలు పోసి పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతుల పరిస్థితి గందరగోళంగా మా రిందన్నారు. పోలీసులు అక్కడి చేరుకొని సముదాయించడంతో రాస్తారోకో విరమించారు. సీపీఐ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రమేశ్, రాములు, స్వామి, రైతులు పాల్గొన్నారు.