సారంగాపూర్/బోథ్, మే 19 ః ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జొన్న రైతులు రోడ్డెక్కుతున్నారు. జొన్నలు కొనుగోలు చేయకపోవడం, పరిమితిగా కొనుగోలు చేయడం, లారీలు, గన్నీబాగులు లేకపోవడంతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మార్కెట్ యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్ రహదారిపై.. మంగళవారం సాయంత్రం చించోలి(బి) నేషనల్ హైవే నిర్మల్-ఆదిలాబాద్ రోడ్డుపై.. ఆదిలాబాద్ జిల్లా బోథ్-నిర్మల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో గంటల తరబడి వాహనాలు నిలిచాయి. ఉన్నతాధికారుల హామీతో ఆందోళనలు విరమించారు.
సారంగాపూర్లో జొన్నలు కొనాలని..
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మార్కెట్ యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్ రహదారిపై జొన్నలు కొనుగోలు చేయాలని మంగళవారం ఉదయం రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడా రు. తహసీల్దార్ విజయ్కాంత్రావుకు ఫో న్ ద్వారా సమాచారం అందించారు. త హసీల్దార్ కలెక్టర్ భవేశ్మిశ్ర దృష్టికి తీసుకువెళ్లి రెండు రోజుల్లో జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ.. సారంగాపూర్ మార్కె ట్ యార్డులో జొన్నలు పోసి నెల రోజులు గడుస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి 20 రోజు ల క్రితం ప్రారంభించారని, అప్పటి ఇప్పటివరకు గన్నీ బ్యాగులు లేక ఒక గింజా కూడా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో మార్పు ల వల్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో జొన్నలు తడసి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
లారీలు, గన్నీబాగుల కోసం..
సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) నేషనల్ హైవే నిర్మల్-ఆదిలాబాద్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం అన్నదాతలు లారీలు, గన్నీ బాగుల కొరతతో ధర్నా చేపట్టారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు లారీలు, గన్నీ బాగులు లేకపోవడంతో పంట ఉత్పత్తులతో కేంద్రాలు నిండాయి. గన్నీ బ్యాగులు, లారీల కొరత తీర్చాలని వేడుకున్నారు.
జొన్నల కొనుగోలు పరిమితి పెంచాలని..
జొన్నల కొనుగోలు పరిమితి ఎకరానికి 20 క్వింటాళ్లకు పెంచాలని కోరుతూ మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్-నిర్మల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సుమారు 2 గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న బోథ్ ఎస్సై పురుషోత్తం అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. కలెక్టర్ స్పష్టమైన హామీ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని రైతులు తెల్చి చెప్పారు. ఎంపీడీవో రమేశ్, తహసీల్దార్ సుభాష్ చందర్ ఘటన స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. వారు ఫోన్ ద్వారా కలెక్టర్ రాజర్షి షాకు విషయాన్ని చేరవేశారు. లారీలు ఏర్పాటు చేసి తూకం వేసిన వాటిని గోదాములకు తరలించేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కొనుగోలు పరిమితి పెంచాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలుపడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంట వేసిన మక్కలు, జొన్నలను లారీల్లో తరలించకపోవడంతో అవస్థలు పడుతున్నామని వాపోయారు. జొన్నలు కేవలం ఎకరానికి 10 క్వింటాలు కొనుగోలు చేస్తుండడంతో మిగిలిన వాటిన ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని, కొనుగోలు పరిమితిని 20 క్వింటాళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.