బజార్ హత్నూర్ : ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాగు పాములు (Snakes ) కలకలం సృష్టించాయి. పాఠశాలలు ప్రారంభమైన రెండు రోజుల్లోనే పాఠశాల ఆవరణలో పాములు సయ్యాటలు ఆడుతూ కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు.
పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, నీటి గుంతలతో సతమతమవుతున్న విద్యార్థులకు పాముల జాడ కనిపించడం మరింత భయాందోళనకు గురి చేస్తుంది. పాముల సయ్యాటలు అక్కడే ఉన్నా ఉపాధ్యాయులు చూసి తమ చరవాణిల్లో బంధించారు. పాఠశాలలో అపరి శుభ్ర వాతావరణాన్ని తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.