తాండూర్ : సీపీఎం జాతీయ మాజీ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి( Sitaram Yechury) ప్రథమ వర్ధంతి (Death anniversary ) ని శనివారం తాండూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం( CPM) మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ
భారతదేశ రాజకీయ రంగంలో సీపీఎం పార్టీ యోధుల్లో ఒకరైన సీతారాం ఏచూరి పేదల పక్షపాతిగా పనిచేశారని కొనియాడారు.
రైతు,కార్మిక, ఉద్యోగ రంగ సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేశారని అన్నారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చాటిచెప్పి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు దిక్సూచిగా నిలబడ్డారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు
దుర్గం నాన్నయ్య, వేల్పుల శంకర్, బొల్లం రాజేశం, కే బాపు, తిరుపతి, వడ్నాల చందు, రామచందర్, తన్నీరు శ్రీనివాస్, సాబీర్, మారెల్లి బుచ్చన్న, లక్ష్మయ్య, చందు, బొమ్మ మల్లేష్, లింగయ్య, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.