ఆసిఫాబాద్‌టౌన్, జూన్ 2 : జిల్లాలోని పోడు భూముల జోలికొస్తే అటవీ శాఖ అధికారులను ఎ క్కడికక్కడ బంధిస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్‌బాబు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అటవీ అధికారుల వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పోడు రైతులకు అండగా ఉంటామని చెప్పి, ఇప్పుడు అదే రైతులపై దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు. అటవీ అధికారులు తమ అత్యుత్సాహం ఆపకపోతే జిల్లాలో తిరగనియ్యబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, నాయకులు కొలిపాక కిరణ్, ప్రసాద్‌గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.