శ్రీరాంపూర్/కాసిపేట/మందమర్రి/రెబ్బెన, నవంబర్ 25 : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై సింగరేణి కార్మికులు, జేఏసీ నాయకులు కన్నెర్ర చేశారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవా రం సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టా రు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీపీలపై సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ, విప్లవ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. సింగరేణీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, సీఐటీయూ అధ్యక్షుడు రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు సదానందం, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ఏనగు రవీందర్‌రెడ్డి, మైనింగ్ స్టాప్ ఇన్చార్జి తిరుపతిరాజు ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.

శ్రీరాంపూర్‌లో విప్లవ కార్మి క సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. టీఎస్‌యూఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, ఐఎఫ్టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మానందం ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 ఇైంక్లెన్ గనిపై జేఏసీ నాయకులు, కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్, పిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మీనారాయ ణ, ఐఎన్టీయూసీ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బన్న లక్ష్మన్ దాస్, సీఐటీ యూ సెంట్రల్ కమిటీ సెక్రెటరీ అల్లి రాజేందర్, టీబీజీకేఎస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బెల్లం అశోక్, అర్ధమల్ల రాజేందర్, సోగాల కన్నయ్య, ఈదునూరి బాపు, బాణోత్ తిరుప తి, శ్రీకాంత్, రాజేశం, అశోక్, రంజిత్, సందీ ప్, శ్రీధర్, అబ్దుల్ రమేశ్, శ్రీనివాస్, సతీశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
మందమర్రి ఏరియాలోని అన్ని గనులు, విభాగాలపై కార్మికులు, ఉద్యోగులు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యం లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం జేఏసీ నాయకులు అన్ని గనులు, విభాగాల అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, నాయకులు వీరారెడ్డి, మధుసూదన్ రెడ్డి, శివ నాయక్, ఏఐటీయుసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్, ఐఎన్టీయుసీ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, దే వి భూమయ్య, సీఐటీయూ నాయకులు వెంకటస్వామి, శ్రీధర్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియాలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియా ఖైర్గూడ ఓసీపీలో నిరసనలు తె లిపి గని అధికారులకు వినతిపత్రం అందించారు. టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, కేంద్ర కమిటీ నాయకులు మంగీలాల్, సమ్మయ్య, కిరణ్, శ్రీనివాస్, పిట్ కార్యదర్శి మెరుగు రమేశ్, నాయకులు బొంగు వెం కటేశ్, గాజవేణి శ్రీనివాస్, గణపతి, తిరుపతి, మొగిలి, శేషు, మారిన వెంకటేశ్వర్లు, ఓరం కిరణ్, భాస్కరచారి, నారాయణ, మాధవకృష్ణ ఉన్నారు.