కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి సింగరేణి ఇసుక బంకర్‌కు (Sand Bunker) వెళ్లే ఇసుక లారీలను ( Lorry ) గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇసుక బంకర్ సంబంధించి నీళ్లు ఇళ్లలోకి, క్రీడా మైదానంలోకి, పార్క్ ప్రాంతాల్లోకి వస్తున్నాయని సింగరేణి అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండి పడ్డారు.
ఇసుక బంకర్ నీళ్లు పోయేందుకు శాశ్వత పరిష్కారం చూపకపోవడం వల్ల పారిశుద్ధ్య సమస్య నెలకొంటుందన్నారు. క్రీడా మైదానంలోకి నీరు చేరి బురద మయమైందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. బురదతో క్రీడలు ఎలా ఆడుతామని, సింగరేణి అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు బోయిని తిరుపతి, మైదం రమేశ్, గోలేటి స్వామి, బాబర్, తయూబ్, రాజన్న, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.