శ్రీరాంపూర్, జూలై 14 : ‘శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గనిలో ఉత్పత్తి చేపట్టేందుకు ఫారెస్టు, ఎన్విరాన్మెంట్ శాఖ అనుమతులు తీసుకోవడంలో సింగరేణి యాజమాన్యం విఫలం అయింది. ఇందులో ఓసీపీ చేసే కుట్ర దా గి ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.’ అని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి ఆరోపించారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డిలతో కలిసి మాట్లాడారు. ఆర్కే-7 గనిలో బొ గ్గు ఉత్పత్తి లీజుకు ఫారెస్టు, ఎన్విరాన్మెంట్ శాఖల అనుమతి తీసుకోవడంలో యాజమా న్యం, అధికారుల నిర్లక్ష్యం కనబడుతున్నదని ఆరోపించారు. దీనిపై సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్టులు, ప్రణాళికలు (పీపీ) నుంచి మొదలుకుని గని మేనేజర్ వరకు అందరిని బాధ్యులను చే స్తు సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పుడు గనిలో ఉత్పత్తి నిలిపివేతకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇ వ్వాలని డిమాండ్ చేశారు. గనుల ప్రైవేటీకరణ ఒకవైపు ముంచుకొస్తుంటే ఉన్న గనులు కొనసాగించడంలో అధికారులు నిర్లక్ష్యం పెనుశాపంగా మారిందని ఆరోపించారు. కార్మికులు తప్పు చేస్తే ఎల్లో, రెడ్ కార్డుల విధానంతో చర్యలు తీసుకుంటామని సర్క్యూలర్ జారీ చేశారని, ఇప్పుడు పైనుంచి కింది వరకు అధికారుల తప్పిదాల వల్లే ఆర్కే-7లో ఉత్పత్తి ని లిచి పోయిందని ఆరోపించారు. అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. అనుమతులు లేకుండా గనిని ఎందుకు నడిపించారన్నారు. గనిలో నెలపాటు ఉత్పత్తి నిలిచి పోతుందని చెబుతున్నారని పేర్కొన్నా రు. గనిలో సుమారు 700 మంది కార్మికులను బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కార్మికులందరిని స్థానికంగానే ఉన్న గను లు, డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేయాలని, ఇతర ఏరియాలకు బదిలీ చేయరాదని హెచ్చరించారు. కార్మికులకు కనీసం బూట్లు, సాక్సు లు, హెల్మెట్లు అందించలేని యాజమాన్యానికి కార్మికులపై ఎల్లో, రెడ్ కార్డుల విధానంతో చర్యలు తీసుకునే అధికారం లేదని మండిపడ్డారు. యాజమాన్యం కార్మికులను దూరప్రాంతాలకు బదిలీ చేయరాదని, గని వద్దకు వెళ్లి అధికారులు, కార్మికులు అధైర్య పడరాదని, ధైర్యం చెప్పి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని తొందరగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉత్పత్తి చేపట్టడానికి ఫారెస్టు, ఎన్విరాన్మెంట్ శాఖల అనుమతులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న క్వార్టర్లలో ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉండరాదని.. వారి వద్ద బకాయిలు వసూలు చేసి ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. వెంటనే కార్మికులకు సంస్థ లాభాలు ప్రకటించి 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో 108 జనరల్ మజ్దూర్ ఖాళీలను సీనియారిటీ ప్రకారం బేసిక్ తగ్గకుండా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానగంటి సత్తయ్య, ఆర్జీ 1 ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్య, నాయకులు మహిపాల్‌రెడ్డి, ఉత్తేజ్‌రెడ్డి, గొర్ల సంతోష్, సిద్దం తిరుపతి, రాజు నాయక్, వెంకట్‌రెడ్డి, ఉప్పాల సంపత్, బిరుదు శ్రీనివాస్, మాధవరెడ్డి పాల్గొన్నారు.