శ్రీరాంపూర్, జూన్ 26 : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉత్తరాలు పంపినట్లు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దండంరాజ్ రాంచందర్‌రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అళవందార్ వేణుమాధవ్ పేర్కొన్నారు.
బుధవారం హైదరాబాద్ ఈసీఐఎల్‌లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమావేశం నిర్వహించారు. తెల్లరేషన్ కార్డు, ఆసరా పింఛన్ మంజూరు చేయాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉత్తరాలు పంపించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భూపెల్లి బానయ్య, కార్యదర్శి సామంతుల నర్సింగ్‌రావు, సలహాదారు టీ ఉమాకర్, నాయకులు పాల్గొన్నారు.