రెబ్బెన, ఫిబ్రవరి 3 : సింగరేణి కారుణ్య నియామకాల్లో డిపెండెంట్స్ ఉద్యోగ బాధితుల మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తెం రాజబాబు డిమాండ్ చేశారు. చలో కొత్తగూడెం పోరుయాత్రలో భాగంగా సోమవారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్షిప్లోగల జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ మారుపేర్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, అనేకసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్మిక సంఘాల నాయకులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు.
వెంటనే సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు క్రిష్ణ, ప్రధాన కార్యదర్శి చాంద్‌పాషా, కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం, హెచ్ఎంఎస్ కార్యదర్శి క్రిష్ణస్వామి, ఉద్యోగ బాధితులు తిరుమల శ్రీనివాస్, లక్క శ్రావణ్, రామిండ్ల సందీప్, ఓంప్రసాద్, దుమ్మటి రాజు, జిల్లాల శ్రావణ్, ఈర్ల సతీశ్, మాచర్ల నవీన్‌కుమార్, సునీల్‌రెడ్డి, హరీశ్, వెంకటస్వామి, కుమార్‌యాదవ్, హిమబింధు, కొమురమ్మ, భీరయ్య, ప్రదీప్‌కుమార్, నరేశ్, రమేశ్, సతీశ్కుమార్యాదవ్ ఉన్నారు.