శ్రీరాంపూర్, మార్చి 9 : సమష్టిగా పనిచేసి సింగరేణి ఉన్నతికి మరింత కృషి చేద్దామని సీఎండీ ఎన్ బలరామ్ అన్నారు. ముఖ్యం గా ఉద్యోగుల్లో క్రమ శిక్షణ, సయపాలన పెంచడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతలు పెరిగే అవకాశముందన్నారు. శనివారం సా యంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్లో గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన 37వ జాయింట్ కన్సల్టేటివ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కంపెనీ భవిష్యత్తుపై పలు కీలక అంశాలను ప్రకటించారు.
ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమై ఉన్న సింగరేణి సంస్థ అనతి కాలంలో జాతీ య స్థాయి కంపెనీగా ఎదగనున్నదని, ము ఖ్యంగా విదేశాల్లో కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టనున్నదని తెలిపా రు. దేశీయ అవసరాల రీత్యా 5 వేల మెగావాట్ల సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని ముం దుకు పోతుందన్నారు. ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ వారితో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు, 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
సుమారు రూ. 26 వేల కోట్ల దీనికోసం కంపెనీ వెచ్చించనున్నదన్నారు. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి మరో నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారం భం కాబోతుందన్నారు. 2025-26లో మూడు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించుకోబోతున్నామని వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వరర్స్ యూనియన్ అ ధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రెటరీ రాజ్‌కుమార్, ప్రాతినిథ్య సంఘం ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్, నాయకులు నరసింహారెడ్డి, అధికారుల సం ఘం అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, కార్యదర్శి నరసింహులు సమస్యలపై సూచనలు తెలియజేశారు. సంస్థ విస్తరణ, ఉత్పాదకత పెం పుదలవంటి విషయాల్లో తాము పూర్తిగా సహకరిస్తామని పేరొన్నారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎల్వీ. సూర్యనారాయణ (ఆపరేషన్స్), వెంకటేశ్వర్లు(పీఅండ్‌పీ), ఈడీ(కోల్ మూమెంట్) ఎస్డీ. ఎం.సు భానీ, జీఎం సీపీపీ. మనోహర్, జీఎం సేఫ్టీ చింతల శ్రీనివాస్, జీఎం(పర్సనల్) ఐఆర్, పీఎం కవితా నాయుడు, వివిధ కార్పొరేట్ శాఖల జీఎంలు పాల్గొన్నారు.