మందమర్రి : భారత రాజకీయ చరిత్రలో ప్రముఖులలో ఒకరైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ( Shyama Prasad Mukherjee) జయంతి సందర్భంగా బీజేపీ( BJP) మందమర్రి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నివాళి అర్పించారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో డాక్టర్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన జ్ఞాపకార్థం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం అప్పటి ప్రధాని నెహ్రూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని శ్యామా ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఆయనను అరెస్ట్ చేసి, జైల్లో తుది శ్వాస విడిచేలా చేశారని దుయ్యబట్టారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రే అని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దీక్షితులు, రోడ్డ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, కర్రావుల వినయ్, పట్టణ ఉపాధ్యక్షుడు పోతునురి రాజేందర్, నాయకులు ఎర్రోజుల శ్రీనివాస్, ఓం ప్రకాష్, గాదె రాములు తదితరులు పాల్గొన్నారు.