బెల్లంపల్లి: బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయంలో ( Integrated Market building complex,) అర్హులకు మాత్రమే షెటర్లు ( Shutters ) కేటాయించాలని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ఆఫ్జల్, నాయకులు ఖలీల్ బేగ్, ఆనంద్, మనోహర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు (Commissioner Srinivasa Rao) వినతిపత్రం సమర్పించారు.
మార్కెట్‌తో సంబంధం లేని వారికి షటర్లు కేటాయించారని వారు ఆరోపించారు. పాత కూరగాయల మార్కెట్ ఉన్నప్పుడు ఖాళీ చేసిన వారికి షటర్లు కేటాయిస్తామని చెప్పి అనర్హులకు అంటగడుతూ ప్రస్తుతం అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గత 40 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
షట్టర్లు కేటాయింపులో భాగంగా లాటరీ తీసే సమయంలో అవకతవకలు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. షట్టర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేయాలని డిమాండ్ చేశారు. అనర్హులను జాబితాలో నుంచి తొలగించని పక్షంలో వ్యాపారులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ నాయకులు పాల్గొన్నారు.