భైంసా, మార్చి, 6 : భైంసా పట్టణంలోని నారాయణ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా ముందుగా ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈవో సుభాష్ అక్కడికి చేరుకున్నారు.
డీఈవో ఆదేశాల మేరకు పాఠశాల ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసులు అందజేశారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ముందుగానే ఫీజులు తీసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారుల వెంట ఏబీవీపీ నాయకులు గంగాప్రసాద్, తదితరులు ఉన్నారు.