
కడెం, జనవరి 6 : రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సుగంధ ద్రవ్యాల బోర్డ్డు నిజామాబాద్ రీజినల్ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ సుందరేషన్, కమ్మర్ పల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పులి శ్రీనివాస్ పేర్కొన్నారు. లింగాపూర్ గ్రామంలో గురువారం స్థానిక రైతు వేదికలో రైతులకు పసు పు పంట సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తప్పని సరిగా నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి సాధ్యమన్నారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని, సేంద్రియ సాగు బోర్డు ద్వారా రైతులు రాయితీలను పొందే అవకాశం ఉంటుం దని పేర్కొన్నారు. రైతులకు రాయితీలు, పసుపు లో వచ్చే తెగుళ్లు నివారణపై అవగాహన కల్పిం చారు. ఏవో సంధ్యారాణి, ఉద్యానవన శాఖ అధి కారి మౌనిక, సుగంధ ద్రవ్యాల బోర్డు విస్తరణ అధికారి అశోక్, జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ కొలిపాక నర్సయ్య, మల్లారెడ్డి, బాలయ్య, ఆంజనేయులు, డీసీఎమ్మెస్ జిల్లా సభ్యులు ఎట్టం దేవన్న, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు ఆకుల లచ్చన్న, మాసాయిపేట, సారం గాపూర్ సర్పంచ్‌లు రాముగౌడ్, రాజరెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.