ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 9 : గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, వైద్య సిబ్బందికి డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగురం పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రోగుల వివరాల నమోదు, పీహెచ్సీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పర్యటించి, ప్రజలకు వ్యాధులతోపాటు కొవిడ్‌పై అవగాహన కల్పించాలని వైద్యులు, వైద్యసిబ్బందికి సూచించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్యం అందించాలన్నారు. గర్భిణులపై ప్రత్యేక దృష్టిపెట్టి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంవో శ్రీధర్, పీహెచ్సీ వైద్యుడు శ్యాం తదితరులు పాల్గొన్నారు.