చింతలమానేపల్లి, ఆగస్టు 3 : ప్రకృతి అందాల మధ్య కొండల నుంచి పాల ధారల జాలువారుతూ శివపల్లి జలపాతం కనువిందు చేస్తున్నది. ఈ జలపాతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి గూడెం సమీపంలోని శివపల్లి అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ ప్రాంతంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తే ఈ జలపాతం అందాలు వీక్షించవచ్చు.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ వాటర్‌ఫాల్స్ ఆహ్లాదాన్ని అందిస్తున్నది.