ఆసిఫాబాద్ : చరిత్రకే వన్నె తెచ్చిన మహనీయుల జాబితాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ (Shivaji Maharaj ) ముందు వరుసలో ఉంటారని, ఆయన అందరికీ ఆరాధ్యుడని ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపల్లి జయరామ్ (Bottupalli Jayaram) అన్నారు. బుధవారం శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ( Officially ) నిర్వహించాలని కొంతకాలంగా వినతులు ఇస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వచ్చే ఏడాది నుంచైనా శివాఋ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, సెలవు (Holiday) ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొలే బిక్కజి, డివిజన్ అద్యక్షడు బోర్కుటే తిరుపతి, మండల అధ్యక్షుడు గేడేకార్ సంతోష్, ప్రధాన కార్యదర్శి నాగపూరి మారుతి, సహాయ కార్యదర్శి కురాట్కార్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన మండల కేంద్రంలో
రెబ్బెన మండల కేంద్రంలో బుధవారం ఆరె సంఘం ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు.