బెల్లంపల్లి, సెప్టెంబర్ 17 : పట్టణంలోని పాత బస్టాండ్ స్థలం కబ్జాకు గురవుతున్నది. కొందరు తమ దుకాణాల ముందు అక్రమంగా రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం తన దుకాణం ముందు మీటర్ ఎత్తులో గోడ నిర్మించిన ఓ వ్యక్తి.. తాజాగా (సోమవారం) రే కుల షెడ్డును సైతం నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. గతం లో పాతబస్టాండ్ వద్ద దుకాణాల ముందు సామగ్రి ఉంచి వ్యాపారా లు చేయడం వల్ల వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన అప్పటి కలెక్టర్.. అప్పటి కమిషనర్‌పై సీరి యస్ అయ్యారు. ఆయన వెంటనే సదరు యజమానులకు గట్టి వా ర్నింగ్ కూడా ఇచ్చారు. అయినా వ్యాపారుల్లో ఎలాంటి మార్పు రాక పోగా, ప్రస్తుతం దుకాణాల ముందు అక్రమ నిర్మాణాలు సైతం చేప డుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతున్నది. ఇప్పటికే పాతబస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు హాల్టింగ్ చేయడానికే డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు వచ్చే సమయానికి అక్కడే ఆటో లు, ద్విచక్రవాహనాలు నిలిపి ఉంచడం వల్ల ఆర్టీసీ డ్రైవర్లు అవస్థలు పడాల్సి వస్తున్నది. బజార్ ఏరియాలోనూ దుకాణాల ముందు ఉన్న పార్కింగ్ స్థలాలను కూడా ఆక్రమించుకొని వ్యాపారాలు చేయడం వల్ల.. కొనుగోలు దారులు తమ వాహనాలను మెయిన్‌రోడ్డుపై నిలిపి వేయాల్సి వస్తున్నది. దీంతో పోలీసులు సదరు వాహన యజమాను లకు జరిమానా విధించి చలాన్లు కూడా వేస్తున్నారు. ఇలాగైతే త మ వాహనాలను ఎక్కడ నిలపాలో అధికారులే చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
బెల్లంపల్లి పాత బస్టాండ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. కొత్తబస్టాండ్ ని ర్మాణం కాకముందు ఇక్కడి నుంచే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిం చేవి. ఆర్టీసీ బస్సులు తిప్పుకొని.. వెళ్లేంత స్థలం ఉండేది. కొత్త బస్టాం డ్ ప్రారంభమైనప్పటి నుంచి పాతబస్టాండ్‌ను కేవలం ప్రయాణికు లను ఎక్కించుకోవడానికి మాత్రమే వినియోగిస్తున్నారు. ఇప్పటికే పా తబస్టాండ్ వద్ద పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులు పడాల్సి వస్తుండగా, దుకాణాదారులు ఓ అడుగు ముందుకేసి పార్కింగ్‌కు వినియోగించే స్థలాలను సైతం కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ము న్ముందు ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదమున్నది. ఇకనైనా అధికారులు కబ్జాలకు చెక్‌పెట్టి.. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారో.. లేదో వేచి చూడాలి మరి.
మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను పోలీసుల సాయంతో కూల్చివేస్తాం. ఇప్పటికే ఏసీపీ రవికుమార్‌తో మాట్లాడాను. కార్యాచరణ రూపొందిస్తున్నాం. త్వరలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తాం. పాతబస్టాండ్ స్థలంలో నిర్మించిన రేకుల షెడ్డును తొలగిస్తాం. మురుగుకాలువలు, దుకాణాల ముందు అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూల్చివేయకముందే దుకాణాణదారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి.