ఆదిలాబాద్ : జిల్లాలోని బజార్హత్నూర్ మండల తహసీల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కటకం విద్యాసాగర్ రెడ్డి( Katkam Vidyasagar Reddy) లంచం ( Bribe) తీసుకుంటూ ఏసీబీ (ACB ) కి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం మండలంలోని బాలన్‌పూర్ శివార్లో ఉన్న 8.35 ఎకరాలకు సంబంధించిన భూమి సాదా బైనామా రిజిస్ట్రేషన్ కోసం బాధితుడు తహసీల్ కార్యలయంలో సంప్రదించాడు.
అక్కడ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న విద్యాసాగర్ రెడ్డి బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా అధికారుల వ్యూహత్మకంగా వ్యవహరించి రూ.2 లక్షలు తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్‌ను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డరన్న ఆరోపణపై అతడిపై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.