కౌటాల, మార్చి 10 : సావిత్రీ బాయి ఫూలే వర్ధంతిని ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మాలీ సంక్షేమ సంఘ భవనంలో మాలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదె వసంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదె వసంత్ మాట్లాడుతూ, భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావ్రితీబాయి అని తెలిపారు.
ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించి ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని ఆయన పే ర్కొన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు నికాడే గంగారాం, ఆదె చందు, వడాయి ప్రసా ద్, మోర్లే పాండు రంగ్, నారాయణ, మధూకర్, వెంకటి, శంకర్, భీంరావు, సంగీత్ రావు, వెంకట్, రశిధర్మ, రాజు, నిరీక్షిత్, ఆశీర్వాదం, నితిన్, ప్రవీణ్, మధు తదితరులున్నారు.
వాంకిడి, మార్చి 10 : సావిత్రీబాయి ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గుర్నులే నారాయణ, మాలీ సంఘం వాంకిడి అధ్యక్షుడు వాడై బాబూరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మాలీ సంఘ భవనం ఆవరణలో సంఘం నాయకులతో కలిసి సావిత్రీబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. మండలంలోని, ఖిర్డీ, ఇందాని, ఆర్లీ, నౌధారి, కోమటిగూడ, గ్రామాల్లో వర్ధంతిని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమాల్లో వాంకిడి మండల వైస్ ఎంపీపీ సెండే రాజ్‌కుమార్, మాలీ సంఘం మండల ప్రధాన కార్యదర్శి సెండె వాసు, ప్రచార కార్యదర్శి సెండె సుధాకర్, యువజన మండలాధ్యక్షుడు మొహార్లే అశోక్, మాలీ సంఘం డివిజన్ అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ, ఉపాధ్యక్షుడు బెండరె దివాకర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
సిర్పూర్(టీ), మార్చి 10 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రీ బాయి ఫూలేను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయాలను కొనసాగించాలని మాలీ సంఘం మండల ప్రధాన కార్యదర్శి వడాయి రవి అన్నారు. భూపాలపట్నం గ్రామంలో ఆదివారం సావిత్రీబాయి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు భూరం భాస్కర్, జెల్ల సంతోశ్, గుణవంత్‌రావ్, నికోడే బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, మార్చి 10 : మండల వ్యాప్తంగా సావిత్రీ బాయి ఫూలే వర్ధంతిని నిర్వహించారు. చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, బారెగూడ గ్రామంలో సావిత్రీ బాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాలీ సంఘం మండలాధ్యక్షుడు నికోడే బాపురావు మాట్లాడుతూ, యువతీ యువకులు సావిత్రీ బాయి ఫూలేను ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో చదివి ఉద్యోగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలీ సంఘం నాయకుడు గుర్లే శ్రీనివాస్, మాలీ కులస్తులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ టౌన్, మార్చి 10 : మండలంలోని కోసిని గ్రామంలో సావిత్రీబాయి ఫూలే విగ్రహానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా రాష్ట్ర మాలీ సంఘం అధ్యక్షుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు లెండుగురె శ్యామ్‌రావు మాట్లాడుతూ, మహిళల హక్కుల కోసం పోరాటం చేసి సంఘ సంస్కర్త, స్త్రీ విద్యాభివృధ్ధికి కృషిచేసిన దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి ఫూలే అని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జిల్లా జడ్పీచైర్మన్ సిడాం గణపతి, జిల్లా సెక్రటరీ ఆవుల రాజ్‌కుమార్ యాదవ్, మాజీ జడ్పీటీసీ తిరుపతి, నాయకులు గౌత్రె గోపాల్, లెండుగురె గోపి, బాబురావు,చోటు, దాసరి నరేందర్, హన్మంతు, బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ ఆల్ సీనియర్స్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి వర్ధంతి సందర్భంగా కోసినిలో సావిత్రీబాయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ, నాయకులు కలికోట రమణయ్య, నారాయణ మూర్తి, బీ నర్సయ్య, మాల మహానాడు నాయకులు వెంకటేశ్, తిరుపతి, శ్రీనివా స్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.