తాండూర్ : మండలంలో కోతుల (Monkeys) బెడద కలకలకం రేపుతుంది. ఆయా గ్రామాల ప్రజలు కోతుల దాడులతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతులు ఇండ్లపై సంచరిస్తూ చిన్నపిల్లలపై దాడికి పాల్పడుతున్నాయని గ్రామస్థులు ఆరోపించారు. తాజాగా తాండూర్ మండలం మాదారం టౌన్షిప్లో గోమాస మహేష్‌పై శుక్రవారం కోతులు దాడి చేశాయి.
కోతుల గుంపు ఒకేసారి రావడం వాటిని తరిమేందుకు ప్రయత్నించగా యువకుడిపై వీపు భాగంలో దాడి చేశాయి. దీంతో అతడు స్వల్పంగా గాయపడడంతో చికిత్స కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంబంధిత అధికారులు కోతుల బెడద లేకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.