నార్నూర్, ఫిబ్రవరి 15 : పాఠశాలలో సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ తోడసం రేణుక బాయి అన్నారు. అది వారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమెన్నత బాలికల పాఠశాలలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పాఠశాలలు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని.
ఎన్ ఆర్ ఈజిఎస్ ద్వారా రూ.8లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సమస్యలు దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్ దేవ్ పటేల్, మెస్రం మోతిరామ్ పటేల్, ఉప సర్పంచ్ రాథోడ్ గణేష్, ప్రధానోపాధ్యాయుడు దన్ను, పవన్ కుమార్, సోము,ఏత్మారావ్,బాది రావ్ తదితరులున్నారు.