కాగజ్నగర్, జనవరి 16: కాగజ్నగర్ పట్టణంతో పాటు మండలంలో సంక్రాంతి పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఉంచి పూజలు చేశారు. మహిళలు నోములు నోచి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంటింటా పిండి వంటలు చేసుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రెబ్బెన, జనవరి 16: మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి పండుగను సంతోషంగా నిర్వహించుకున్నారు. మహిళలు ఇండ్ల ముందు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. పిల్లలు, యువకులు గాలిపటాలు ఎగురవేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
దహెగాం, జనవరి 16 : ప్రస్తుత పరిస్థితుల్లో మన సంస్కృతీసంప్రదాయాలను కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఎస్ఐ సనత్ కుమార్ అన్నారు. మండలంలోని లగ్గా గ్రామంలో శ్రీ ఉమా చంద్రశేఖరస్వామి ఆలయంలో యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన 40 మంది ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోండ్ర అనూష, గ్రామ పెద్దలు ప్రభాకర్ గౌడ్, ఆలయ ధర్మకర్త ప్రభాకర్, ఉపాధ్యాయులు పోచయ్య, బుర్రి శ్రీనివాస్, పోతాజుల లక్ష్మణ్, లగ్గాం దామోదర్, జర్పుల శ్యాం, పంచాయతీ కార్యదర్శి రాకేశ్, ఆలయ అర్చకులు శ్రీకాంతాచారి, యూత్ కమిటీ అధ్యక్షుడు ఇంగిలి రవి, ఉపాధ్యక్షడు రాజేశ్ పాల్గొన్నారు.
బెజ్జూర్, జనవరి 16 : మండలంలో సంక్రాంతి, కనుమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు రంగు రంగుల ముగ్గులు వేశారు. పిండి వంటలు చేసుకొని బంధు మిత్రులను ఆహ్వానించి వేడుకలను నిర్వహించారు.
కెరమెరి, జనవరి16: మండలంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.వాకిళ్ల ముగ్గులు వేసి, వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలు, యువకులు గాలి పటాలు ఎగురవేస్తూ సంబురాలు నిర్వహించారు.
ఆసిఫాబాద్ టౌన్, జనవరి16 : మండలంలోని బాబాపూర్లో ఎడ్ల బండ్ల పోటీలను ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ సమక్షంలో నిర్వహించారు. ఈ పోటీల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రథమ విజేతకు రూ.2 వేలు, ద్వితీయ విజేతకు వెయ్యి రూపాయలు బహుమతి ని ఎంపీపీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, సర్పంచ్ వరలక్ష్మి, గ్రామ పెద్దలు శంకర్, కిషన్, గణపతి, రాజన్న నాయకులు పెంటయ్య, రాజు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు
మండలంలోని ఈదులవాడలో సంక్రాంతి వేడుకలను పురసరించుకుని ఎంపీపీ మల్లికార్జున్ ఆధ్వర్యంలో సర్పంచ్ భీమేశ్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ఎంపీపీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, ఆసిఫాబాద్ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరి వెంకన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.