నిర్మల్ చైన్‌గేట్, జూలై 4 : పంట మార్పిడి విధానాలు, ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నిర్మల్‌లో కలెక్టర్ భవేశ్‌మిశ్రా, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2026-27 సంవత్సరానికి 85 వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు.
పంట మార్పిడి విధానాలు అవలంబించాలన్నారు. కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని వివరించారు. జిల్లాలో ఆయిల్ పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, డీపీవో శ్రీనివాస్శ్రీనివాస్, డీఈవో భోజన్న పాల్గొన్నారు.