తాండూర్ : సమ్మక్క సారలమ్మ జాతర ( Sammakka Jatara ) ను పురస్కరించుకుని మండలంలో ప్రజలు వివిధ రకాల మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని భక్తులు కిరాణా దుకాణాల వద్దకు వెళ్లి బంగారం (బెల్లం) తులాభారాలను నిర్వహిస్తూ బంగారాన్ని ప్రసాదంగా ప్రజలకు పంచుతున్నారు.
సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రజలు సాంప్రదాయంలో భాగంగా స్థానిక వేములవాడ, కొండగట్టు, కొమురవెళ్లి ఆలయాలను దర్శించడానికి తరలివెళ్తున్నారు. పుణ్య క్షేత్రాల దర్శనం అనంతరం మేడారం వెళ్లేందుకు వివిధ రకాల వాహనాలను ముందుగానే బుక్ చేసుకున్నారు. కొందరు ఆర్టీసీ బస్సుల్లో తరలివెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకున్నారు.