పెంబి, డిసెంబర్ 3 : అసెంబ్లీ ఎన్నికల ఫలితా ల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సల్లా స్వప్నిల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తులాల శంకర్, భుమేశ్, స్వామి పాల్గొన్నారు.
దస్తురాబాద్, డిసెంబర్ 3 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో,అలాగే ఖానా పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు గెలువడంతో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, పటాకులు కాలుస్తూ సంబు రాలు చేసుకున్నారు. నాయకులు, కార్యరకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 3 : ఖానాపూర్ నియోజ కవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యే గా విజయం సాధించడంతో సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షులు ఇమామ్, కాంగ్రెస్ నాయకులు రామారావ్, ఇమ్రాన్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, డిసెంబర్ 3 : ఖానాపూర్ నియో జకవర్గ ఎమ్మెల్యేగా వెడ్మ బొజ్జు పటేల్ గెలుపొం దడంతో మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ఆదివాసీలతోపాటు నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఫూలమాల వేసి, కుమ్రం భీం విగ్రహం ఏర్పాటు స్థలం వద్ద నివాళుల ర్పించారు. అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులర్పించారు. మండలకేంద్రంలో పటాకు లు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఆది వాసీ గ్రామాల్లో డోల్ సన్నాయిలు వాయిస్తూ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెస్లాపూర్ రాయిసెంటర్ సార్ మేడి మెస్రం వెంకట్రావ్పటేల్, ఆదివాసీలు నాగ్నాథ్, సోయం రాందాస్, మడావి లచ్చుపటేల్, ఆనంద్ రావ్, బోజ్జు, అంబాజీ, మానిక్రావ్, దళిత నాయకులు నాగోరావ్, విఆల్, బాబాసాహెబ్, తదితరులు పాల్గొన్నారు.